సాకే శైలజానాథ్‌ను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌ | Ys Jagan Phone Call To Sake Sailajanath | Sakshi
Sakshi News home page

సాకే శైలజానాథ్‌ను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌

Nov 21 2025 10:25 PM | Updated on Nov 21 2025 10:57 PM

Ys Jagan Phone Call To Sake Sailajanath

సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. శైలజానాథ్‌ తల్లి గంగమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్న వైఎస్‌ జగన్‌.. శైలజానాథ్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

సాకే శైలజానాథ్‌ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సాకె గంగమ్మ ఈ ఉదయం(శుక్రవారం) కన్నుమూశారు. శైలజానాథ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన సాకే శైలజానాథ్‌.. ప్రస్తుతం శింగనమల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement