స్పెషల్‌ ఉగాది | Mahesh babu 25th movie updates | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఉగాది

Jul 4 2018 12:27 AM | Updated on Jul 4 2018 6:27 AM

Mahesh babu 25th movie updates - Sakshi

నో మోర్‌ డౌట్స్‌. మరోసారి సమ్మర్‌కి సై అని, వచ్చే ఏడాది ఉగాది రుచులను థియేటర్స్‌లో చూపిస్తాం అంటున్నారు మహేశ్‌బాబు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో సమ్మర్‌లో మహేశ్‌బాబు హిట్‌ సాధించారు. గతంలోనూ మహేశ్‌ కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌గా నిలిచిన ‘పోకిరి’ కూడా ఏప్రిల్‌లోనే రిలీజైందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది.

‘‘ఈ ఏడాది ఉగాది ఇంకాస్త స్పెషల్‌గా ఉండబోతుంది. 2019 ఏప్రిల్‌ 5న మహేశ్‌బాబు సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. రవి పాత్రలో నరేశ్‌ నటిస్తుండగా, కృష్ణ పాత్రలో మహేశ్‌ నటిస్తున్నారని సమాచారమ్‌. మహేశ్, ‘అల్లరి’ నరేశ్, పూజా ఎమ్‌బీఏ క్లాస్‌మేట్స్‌గా కనిపిస్తారట. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీకరిస్తున్న కాలేజీ సీన్స్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తాయని టాక్‌. 


 

Advertisement
 
Advertisement
Advertisement