గెలిచి చూపించడం నాకు అలవాటు: మహేశ్‌బాబు | Maharshi Movie Teaser Released | Sakshi
Sakshi News home page

‘మహర్షి’ టీజర్‌ విడుదల

Apr 6 2019 9:37 AM | Updated on Apr 7 2019 12:28 PM

Maharshi Movie Teaser Released - Sakshi

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’ టీజర్‌ శనివారం విడుదలైంది.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’ టీజర్‌ శనివారం విడుదలైంది. ఉగాది పండుగ సందర్భంగా అభిమానుల కోసం ఈ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. స్టెయిలిష్‌ లుక్‌లో మహేశ్‌బాబు అదరగొట్టాడు. ఈ సినిమాలో ‘ప్రిన్స్‌’ చెప్పిన డైలాగులు అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ‘సక్సెస్‌కు ఫుల్‌స్టాప్స్‌ ఉండవు కామాలు మాత్రమే ఉంటాయ్‌.. ఎవడైనా నువ్వు ఓడిపోతావ్‌ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు’ అంటూ రిషి పాత్రలో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇందులో స్టూడెంట్‌గా, బిజినెస్‌మేన్‌గా మహేశ్‌బాబు కనిపిస్తారు. మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement