‘మహానటి’ మోషన్‌ పోస్టర్‌ విడుదల | Mahanati Motion Poster Released | Sakshi
Sakshi News home page

‘మహానటి’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

Apr 13 2018 11:58 AM | Updated on Apr 13 2018 7:08 PM

Mahanati Motion Poster Released - Sakshi

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. టైటిల్‌ రోల్‌లో కీర్తి సురేశ్‌ నటించగా, ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్ర యూనిట్‌. రెండ్రోజుల క్రితమే విజయ్‌ దేవరకొండ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయగా తాజాగా సమంత, విజయ్‌లతో కూడిన ఒక మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

మధురవాణీగా సమంత, విజయ్‌ ఆంటోనిగా విజయ్‌ దేవరకొండలు నటిస్తున్నారని తెలిసిందే. నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది మధురవాణి గారు అంటూ వచ్చిన పోస్టర్‌లో ఏ విషయం గురించో ఇద్దరు మాట్లాడుకుంటున్నారని తెలిసిపోయింది. తాజాగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో విజయ్‌ పాత కెమెరాను పట్టుకుని, నవ్వుకుంటూ సమంతతో ఏదో మాట్లాడుతుండగా...సమంత మాత్రం తీక్షణంగా ఏదో పుస్తకాన్ని చదువుకుంటూ వింటున్నట్లు కనపడుతుంది. అసలు వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రేపు (ఏప్రిల్‌ 14న) టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృంధం తెలిపింది. మే 9న మహానటి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement