మహాలక్ష్మి సందడి మొదలవుతోంది..! | That Is Mahalakshmi Teaser On 21st December | Sakshi
Sakshi News home page

Dec 15 2018 4:28 PM | Updated on Dec 15 2018 7:39 PM

That Is Mahalakshmi Teaser On 21st December - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ హిట్ ‘క్వీన్‌’ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలో ఒకేసారి రీమేక్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ  భాషల్లో ఈ రీమేక్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దట్‌ ఈజ్ మహాలక్ష్మీ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో అ! ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకోగా డిసెంబర్ 21న టీజర్‌ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్‌లో కాజల్‌, మలయాళ వర్షన్‌లో మంజిమా మోహన్‌, కన్నడ వర్షన్‌లో పరుల్‌ యాదవ్‌లు లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement