ప్రయాణం మొదలైంది! | Magalir Mattum Official Second Look Poster | Sakshi
Sakshi News home page

ప్రయాణం మొదలైంది!

Jan 17 2017 12:02 AM | Updated on Sep 5 2017 1:21 AM

ప్రయాణం మొదలైంది!

ప్రయాణం మొదలైంది!

‘జ్యోతిక ఈజ్‌ బ్యాక్‌’ అని అందరూ మెచ్చుకునే రేంజ్‌లో ఆమె ‘36 వయదినిలే’ చిత్రంలో అద్భుతంగా నటించారు.

‘జ్యోతిక ఈజ్‌ బ్యాక్‌’ అని అందరూ మెచ్చుకునే రేంజ్‌లో ఆమె ‘36 వయదినిలే’ చిత్రంలో అద్భుతంగా నటించారు. హీరో సూర్యను పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయిన జ్యోతిక మళ్లీ సినిమాల్లో కొనసాగాలనుకుని, ‘36 వయదినిలే’ ద్వారా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు  ‘మగళిర్‌ మట్టుమ్‌’ అనే మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్‌ లుక్‌ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.

జ్యోతిక బైక్‌ మీద వెళుతున్న ఫొటోని చూస్తుంటే, ఇందులో ఆమెది పవర్‌ఫుల్‌ రోల్‌ అని అర్థమవుతోంది. ‘‘ప్రభ (ఈ సినిమాలో జ్యోతిక పాత్ర పేరు) ప్రయాణం మొదలైంది’’ అంటూ సెకండ్‌ లుక్‌ను సూర్య విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. బ్రహ్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అన్నట్లు.. ఆ మధ్య తన భార్యకు సూర్య బైక్‌ ఎలా నడపాలో నేర్పించారు. చెన్నై రోడ్స్‌ మీద జ్యోతిక ద్విచక్ర వాహనం నేర్చుకోవడం చాలామంది కంట పడింది. ఇప్పుడామె ఎందుకు బైక్‌ నేర్చుకుంటున్నారా? అనుకున్నవాళ్లకు ఈ సెకండ్‌ లుక్‌ సమాధానం చెప్పేసింది. ఈ సినిమా కోసమే జ్యోతిక బైక్‌ నేర్చుకున్నారని ప్రత్యేకంగా చెప్పాలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement