మథనం విభిన్నంగా ఉంది

Madhanam Movie Trailer Launch by Director Sukumar - Sakshi

శ్రీనివాస్‌ సాయి, భావనరావు జంటగా అజయ్‌ మణికందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మథనం’. దివ్య ప్రసాద్, అశోక్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న  అమెరికాలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత ఇండియాలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను డైరెక్టర్‌ సుకుమార్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ విభిన్నంగా ఉంది. అశోక్‌ ప్రసాద్‌ ప్యాషన్‌ ఉన్న నిర్మాత. నా సినిమా ‘1 నేనొక్కడినే’ కూడా అమెరికాలో బాగా ఆడింది.

మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు’’అన్నారు. ‘‘అశోక్‌కి సినిమా అంటే పిచ్చి. కొత్త పాయింట్‌తో మంచి ప్రయత్నం చేశారు’’ అన్నారు డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి. ‘‘వాస్తవ సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాశా’’ అన్నారు అజయ్‌. ‘‘కేవలం అమెరికాలో సినిమా రిలీజ్‌ చేయడం ఇదే మొదటిసారి’’ అన్నారు అశోక్‌ ప్రసాద్‌. ‘‘ఎన్‌ఆర్‌ఐ నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, అనిల్‌ సుంకరలాగా అశోక్‌  మంచి హిట్‌ చిత్రాలు తీయాలి’’ అన్నారు ‘తానా’ అధ్యక్షుడు సతీష్‌ వేమన. శ్రీనివాస్‌ సాయి మాట్లాడారు.
 ∙ట్రైలర్‌ లాంచ్‌లో సుకుమార్, సురేందర్‌ రెడ్డితో చిత్రబృందం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top