ప్రేమ ప్రయాణం విజయం | Maa Love Journey Success Movie Launch | Sakshi
Sakshi News home page

ప్రేమ ప్రయాణం విజయం

Apr 3 2018 12:43 AM | Updated on Apr 3 2018 12:43 AM

Maa Love Journey Success Movie Launch  - Sakshi

రాజీవ్, ప్రియాంక

ప్రస్తుతం సమాజంలో ప్రేమికుల్ని అర్థం చేసుకోకుండా విడదీసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేమికుల్ని విడదీయకూడదు..  కలిపే ప్రయత్నం చెయ్యాలనే కథాంశంతో ధన్వంతరీ క్రియేషన్స్‌ పతాకంపై ‘మా లవ్‌ జర్నీ సక్సెస్‌’ అనే చిత్రం ప్రారంభమైంది. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో కె.పి. లక్ష్మణాచారి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్‌ సాలూరి కథానాయకుడిగా నటిస్తున్నారు.

తొలి సన్నివేశానికి నవీన్‌ యాదవ్‌ క్లాప్‌ నివ్వగా, కోటి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న కోటి మాట్లాడుతూ –‘‘మా అబ్బాయి రాజీవ్‌ నటిస్తున్న పదో సినిమా ఇది. మంచి కథ. రాజీవ్‌కి మంచి బ్రేక్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘హీరో పాత్ర మాస్‌గా, హీరోయిన్‌ క్యారెక్టర్‌ క్లాస్‌గా ఉంటుందని దర్శకుడు’’ తెలిపారు. పది రోజుల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. జూన్‌లో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి కెమెరా: పి.విజయ్‌ కుమార్, పాటలు: చంద్రబోస్, వెనిగళ్ల రాంబాబు.
 

Advertisement
 
Advertisement
Advertisement