మ్యాన్‌.. మ్యాడ్‌.. మనీ | M3 Movie updates | Sakshi
Sakshi News home page

మ్యాన్‌.. మ్యాడ్‌.. మనీ

Nov 28 2019 12:35 AM | Updated on Nov 28 2019 12:35 AM

M3 Movie updates - Sakshi

సూర్య శ్రీనివాస్, అమృతా ఆచార్య

సూర్య శ్రీనివాస్, అమృతా ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఎం 3’. ‘మ్యాన్‌ మ్యాడ్‌ మనీ’ అనేది ఉపశీర్షిక. దర్శక–నిర్మాత రామకృష్ణ తోట మాట్లాడుతూ– ‘‘కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా ‘ఎం 3’ చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా ఉంటుంది. సూర్య, అమృత బాగా నటించారు. సునీల్‌ కశ్యప్‌ మంచి సంగీతం అందించారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ఈ సినిమాకు శరత్‌ కొండూరు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

Advertisement
 
Advertisement
Advertisement