నెర్వస్‌గా ఫీల్‌ అవుతున్నా | Lover Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

నెర్వస్‌గా ఫీల్‌ అవుతున్నా

Jul 16 2018 12:35 AM | Updated on Jul 16 2018 12:35 AM

Lover Movie Trailer Launch - Sakshi

దిల్‌ రాజు, రాజ్‌ తరుణ్, హర్షిత్‌ రెడ్డి, అనీష్‌ కృష్ణ, రిద్ధి కుమార్‌

‘‘ఇప్పటి వరకు మా బ్యానర్‌లో 27 సినిమాలు వచ్చాయి. అందులో 22 సక్సెస్‌ అయ్యాయి. మిగిలిన 5 కూడా వర్కౌట్‌ అయ్యాయి. ‘లవర్‌’ చిన్న సినిమాగా వస్తున్నా పెద్ద సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నా’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. రాజ్‌ తరుణ్, రిద్ధి కుమార్‌ జంటగా ‘అలా ఎలా’ ఫేమ్‌ అనీశ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవర్‌’. ‘దిల్‌’ రాజు నిర్మాణ సారథ్యంలో హర్షిత్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన అంకిత్‌ తివారి, తనీశ్, సాయి కార్తీక్, జె.బిలు  ‘లవర్‌’ ట్రైలర్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం లుక్స్, టీజర్, సాంగ్స్‌ బావున్నాయి. హర్షిత్‌ ఫస్ట్‌ సినిమా. నా ఫస్ట్‌ సినిమా కంటే నెర్వస్‌గా ఫీల్‌ అవుతున్నా. అందరూ హార్డ్‌ వర్క్‌ చేసి మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మా చిత్రం పెద్ద సక్సెస్‌ అవుందని భావిస్తున్నా’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. ‘‘తెలుగులో నా మొదటి చిత్రమిది’’ అన్నారు రిద్ధి కుమార్‌. ‘‘సోలో నిర్మాతగా నా ఫస్ట్‌ సినిమా ఇది’’ అన్నారు హర్షిత్‌ రెడ్డి. ‘‘అలా ఎలా’ చిత్రం తర్వాత ‘లవర్‌’ కి మూడేళ్లు గ్యాప్‌ వచ్చింది. త్వరగా చేసి ఉంటే మా నాన్నగారు  ఈ సినిమా చూసేవారు. ప్రస్తుతం ఆయన లేరు’’ అన్నారు అనీశ్‌ కృష్ణ.

Advertisement
 
Advertisement
Advertisement