ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం చివరికి..! | Hyderabad Lover Attack Incident | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం చివరికి..!

Oct 13 2026 12:13 PM | Updated on Oct 13 2026 12:34 PM

Hyderabad Lover Attack Incident

మృతి చెందిన అంజలి, నిందితుడు అశ్విన్

హైదరాబాద్: వివాహం చేసుకో అని సలహా ఇచ్చిన మహిళపై ఓ వ్యక్తి కత్తితోదాడిచేసి హత్యచేశాడు. అల్లాపూర్‌ సీఐ నవీన్‌కుమార్‌ తెలిపిన మేరకు.. బీదర్‌కు చెందిన అంజలి అక్క, బావలతో కలిసి  బబ్బుగూడలో నివాసముంటోంది. ఈమె భర్త సాగర్‌ ఓ కేసులో రెండేళ్లపాటు జైలులో ఉన్నాడు. ఆ సమయంలో సాగర్‌ స్నేహితుడు ఆటో డ్రైవర్‌ అశ్విన్ (25), అంజలి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 

ఈ క్రమంలో ఇద్దరం కలిసి జీవిద్దామని అశ్విన్ పట్టుబట్టాడు. అయితే అంజలి అందుకు ఒప్పుకోలేదు. మరొకరిని పెళ్లిచేసుకోవాలని సలహాచెప్పింది. దీంతో ఆగ్రహించిన  అశ్విన్ ఈనెల 10న కత్తితో దాడి చేశాడు. రక్షించేందుకు సోదరి అశ్విని యత్నించగా ఆమెపై కూడా దాడిచేశాడు. స్థానికులు  ఆసుపత్రికి తరలించగా అంజలి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement