ప్రేమలో థ్రిల్‌ | love thriller movie teaser launch | Sakshi
Sakshi News home page

ప్రేమలో థ్రిల్‌

Apr 28 2019 3:25 AM | Updated on Apr 28 2019 3:25 AM

love thriller movie teaser launch - Sakshi

సాయితేజ, తరుణి

కల్వకోట సాయితేజ, తరుణీసింగ్‌ జంటగా తెరకెక్కిన లవ్‌ థ్రిల్లర్‌ ‘శివన్‌’. ‘ది ఫినామినల్‌ లవ్‌స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. శివన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. సినీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సంతోష్‌ రెడ్డి లింగాల నిర్మించిన ఈ చిత్రం టీజÆŠని నిర్మాతలు రాజ్‌కందుకూరి, వల్లూరిపల్లి రమేష్, దర్శకులు వి.ఎం.ఆదిత్య, ఆనంద్‌ రవి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ– ‘‘టీజర్‌ చూస్తుంటే సినిమా పెద్ద హిట్‌ అయ్యేలా ఉంది. సినిమా గురించి అందరూ మాట్లాడుకునేంత గొప్పగా ఉంది.

రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి సినిమా రంగంలోకి వస్తున్న సంతోష్‌ రెడ్డి ఇక్కడా సక్సెస్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘శివన్‌ చెప్పిన కథ నచ్చి నిర్మాతగా మారాను. మిత్రుడు బిట్టుతో పాటు ప్రతి ఒక్కరూ ఈ చిత్రం కోసం అంకితభావంతో పని చేశారు’’ అన్నారు లింగాల సంతోష్‌ రెడ్డి. ‘‘నిర్మాతలు సంతోష్‌ రెడ్డి, వున్నా మురళితో పాటు టీమ్‌ సహాయ సహకారాలవల్లే సినిమా బాగా వచ్చింది’’ అని శివన్‌ అన్నారు. చిత్ర సహ నిర్మాత వున్నా మురళి (బిట్టు), కల్వకోట సాయితేజ్, తరుణీసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శంకర్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement