breaking news
Love thriller
-
ప్రేమలో థ్రిల్
కల్వకోట సాయితేజ, తరుణీసింగ్ జంటగా తెరకెక్కిన లవ్ థ్రిల్లర్ ‘శివన్’. ‘ది ఫినామినల్ లవ్‌స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. శివన్ దర్శకత్వంలో ఎస్.ఆర్. సినీ ఎంటర్టైన్మెంట్స్పై సంతోష్ రెడ్డి లింగాల నిర్మించిన ఈ చిత్రం టీజÆŠని నిర్మాతలు రాజ్‌కందుకూరి, వల్లూరిపల్లి రమేష్, దర్శకులు వి.ఎం.ఆదిత్య, ఆనంద్ రవి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ– ‘‘టీజర్ చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అయ్యేలా ఉంది. సినిమా గురించి అందరూ మాట్లాడుకునేంత గొప్పగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం నుంచి సినిమా రంగంలోకి వస్తున్న సంతోష్ రెడ్డి ఇక్కడా సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. ‘‘శివన్ చెప్పిన కథ నచ్చి నిర్మాతగా మారాను. మిత్రుడు బిట్టుతో పాటు ప్రతి ఒక్కరూ ఈ చిత్రం కోసం అంకితభావంతో పని చేశారు’’ అన్నారు లింగాల సంతోష్ రెడ్డి. ‘‘నిర్మాతలు సంతోష్ రెడ్డి, వున్నా మురళితో పాటు టీమ్ సహాయ సహకారాలవల్లే సినిమా బాగా వచ్చింది’’ అని శివన్ అన్నారు. చిత్ర సహ నిర్మాత వున్నా మురళి (బిట్టు), కల్వకోట సాయితేజ్, తరుణీసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్. -
లవ్ థ్రిల్లర్
విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందించిన చిత్రం ‘జగన్నాటకం’. ప్రదీప్ అందాన్, ఖెనీశ చంద్రన్ జంటగా ప్రదీప్ నందన్ దర్శకత్వంలో ఐ. ఆదిశేషరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం క్లైమాక్స్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని తెలిపారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయని, సినిమా కూడా సక్సెస్ అవుతుందని సంగీత దర్శకుడు అజయ్ అరసాడ అన్నారు.