'ప్రేమ కథలు ఎలా ఉన్నా ఇష్టం' | Love story is my favourite genre: Katrina Kaif | Sakshi
Sakshi News home page

'ప్రేమ కథలు ఎలా ఉన్నా ఇష్టం'

Jan 26 2016 9:33 PM | Updated on Apr 4 2019 5:42 PM

'ప్రేమ కథలు ఎలా ఉన్నా ఇష్టం' - Sakshi

'ప్రేమ కథలు ఎలా ఉన్నా ఇష్టం'

త్వరలో ఫితుర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోన్న కత్రినా, సినిమా ప్రమోషన్లో భాగంగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈసందర్భంగా తనకు లవ్ స్టోరీస్ అంటే ఎంతో...

త్వరలో ఫితుర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోన్న కత్రినా, సినిమా ప్రమోషన్లో భాగంగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈసందర్భంగా తనకు లవ్ స్టోరీస్ అంటే ఎంతో ఇష్టమని ఎలాంటి సినిమాల్లో నటించినా, ఎక్కువగా లవ్ స్టోరీసే చూస్తానని తెలిపింది. 'సినిమాల్లో లవ్ స్టోరీస్ నాకిష్టమైన జానర్, విషాదాంతలైన, స్ఫూర్తినిచ్చే కథలైన లవ్ స్టోరీస్ ఎలా రూపొందించినా ఆకట్టుకుంటాయి' అంటూ తనకు నచ్చిన సినిమాల జానర్ను అభిమానులకు తెలియజేసింది.

చార్లెస్ డికెన్స్ నవల గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఫితూర్ సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్కు జోడిగా నటిస్తోంది ఈ బ్యూటి. టబు, లారాదత్త, అదితిరావ్ హైదరీలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోంది. అభిషేక్ కపూర్ దర్వకత్వం చేయడంతో పాటు   సిద్దార్థ్ రాయ్ కపూర్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement