‘లంక’లో ప్రేమకథ | Love Story in 'Lanka' | Sakshi
Sakshi News home page

‘లంక’లో ప్రేమకథ

Nov 14 2013 12:18 AM | Updated on Sep 2 2017 12:34 AM

‘లంక’లో ప్రేమకథ

‘లంక’లో ప్రేమకథ

లంక అనగానే మనకు గుర్తొచ్చేది రాముడు, సీత, రావణుడు. సీతను తనదాన్ని చేసుకోవడానికి రావణుడు పన్నిన కుట్ర మనకు తెలిసిందే.

లంక అనగానే మనకు గుర్తొచ్చేది రాముడు, సీత, రావణుడు. సీతను తనదాన్ని చేసుకోవడానికి రావణుడు పన్నిన కుట్ర మనకు తెలిసిందే. కానీ, ఈ లంక కథ వేరు అంటున్నారు వెంకట్‌రాజ్. రవి, అక్షత జంటగా ఆయన దర్శకత్వంలో శ్రీనివాస్ బి. నిర్మిస్తున్న చిత్రం ‘లంక’. ఈ సినిమా పాటల రికార్డింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామాయణంలోని లంకలో రావణుడు రాక్షసుడై సీతను చెరబట్టాడు. కానీ, ఈ లంకలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రఘు ఆర్. బళ్ళారి, సంగీతం: మణి జెన్న, ఫైట్స్: జాషువా, సహనిర్మాతలు: బద్దెల నాగరాజు, ఎమ్. అల్లూరమ్మ అచ్చయ్య.

Advertisement
 
Advertisement
Advertisement