పక్కా మాస్ లోఫర్! | loafer movie audio lunch on december 7th | Sakshi
Sakshi News home page

పక్కా మాస్ లోఫర్!

Nov 22 2015 11:36 PM | Updated on Sep 3 2017 12:51 PM

పక్కా మాస్ లోఫర్!

పక్కా మాస్ లోఫర్!

‘లోఫర్’ అనే టైటిల్‌తో సినిమా వస్తే, కచ్చితంగా అందులో హీరో ఫుల్ మాస్‌గా కనిపిస్తాడని ఫిక్స్ అయిపోవచ్చు.

‘లోఫర్’ అనే టైటిల్‌తో సినిమా వస్తే, కచ్చితంగా అందులో హీరో ఫుల్ మాస్‌గా కనిపిస్తాడని ఫిక్స్ అయిపోవచ్చు. పూరి జగన్నాథ్ ‘లోఫర్’గా వరుణ్ తేజ్ అలానే కనిపించనున్నారు. అయితే, మాస్‌తో పాటు ఫ్యామిలీస్ కూడా చూసే విధంగా ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ కూడా జోడించారు పూరి. సి. కల్యాణ్ సమర్పణలో సీవీ రావు, శ్వేతలానా, వరుణ్,తేజ ఈ చిత్రాన్ని నిర్మించారు. దిశా పటాని కథానాయిక. సి. కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘వినోదం, మదర్ సెంటిమెంట్, హై యాక్షన్ ఈ చిత్రంలో ఉంటాయి.

తక్కువ సమయంలో ట్రైలర్‌కి పది లక్షల క్లిక్స్ వచ్చాయి. పూరి దర్శకత్వంలో వచ్చిన రవితేజకు ‘ఇడియట్’, మహేశ్‌కు ‘పోకిరి’, ఎన్టీఆర్‌కు ‘టెంపర్’, రామ్ చరణ్‌కు ‘చిరుత’, అల్లు అర్జున్‌కు ‘దేశముదురు’లా వరుణ్ కెరీర్‌లో ఈ చిత్రం మంచి మాస్ సినిమాగా మిగిలిపోతుంది. డిసెంబర్ 7న పాటలను, 18న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement