సిన్మాలోని ఆ 'మిరాకిల్‌' ఇప్పుడు నిజమైందా? | Life Catches up With Nirupa Roy, Do not Laugh Now, Tweets Rishi Kapoor | Sakshi
Sakshi News home page

సిన్మాలోని ఆ 'మిరాకిల్‌' ఇప్పుడు నిజమైందా?

May 9 2016 6:09 PM | Updated on Aug 25 2018 6:31 PM

సిన్మాలోని ఆ 'మిరాకిల్‌' ఇప్పుడు నిజమైందా? - Sakshi

సిన్మాలోని ఆ 'మిరాకిల్‌' ఇప్పుడు నిజమైందా?

సినిమాలకు, నిజజీవితానికి చాలా వ్యత్యాసం ఉందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు.

సినిమాలకు, నిజజీవితానికి చాలా వ్యత్యాసం ఉందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. కానీ, సినిమాల్లో చూపే అద్భుతాలు నిజజీవితంలో జరిగే అవకాశమే లేదా? సినిమాల్లో చూపేవన్నీ అర్థంలేని గిమ్మిక్కుల్లేనా? తర్కానికి లొంగని ఆ అద్భుతాలు నిజజీవితంలో నిజమయ్యే చాన్సే లేదా? అంటే ఉందని అంటున్నాడు అలనాటి బాలీవుడ్ హీరో రిషి కపూర్‌. 70వ దశకంలో మన్మోహన్ దేశాయ్‌ తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ హిట్‌ సినిమా 'అమర్ అక్బర్‌ ఆంటోనీ'ని ఇందుకు ఉదహరణగా ఆయన చెప్తున్నాడు.

ఇప్పుడు సడన్‌గా ఆయన ఈ సినిమా గురించి ఎందుకు ప్రస్తావించారంటే.. అందుకు కారణం లేకపోలేదు. ఫ్లోరిడాలో ఓ మహిళ 20 ఏళ్ల కిందట చూపు కోల్పోయింది. ఇక, ఆమె జీవితాంత అంధురాలిగా చీకట్లోనే మగ్గాలని అంతా అనుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె కిందపడటం.. తలకు దెబ్బ తగిలి ఆమెకు చూపు తిరిగి వచ్చింది. 70 ఏళ్ల మహిళకు 'అద్భుతమన్న' రీతిలో చూపు తిరిగి వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ.. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలోని ఇలాంటి చూపించిన ఇలాంటి అద్భుతాన్నే ఆయన గుర్తుచేసుకున్నారు.

మన్మోహన్ దేశాయ్‌ తెరకెక్కించిన ఈ క్లాసిక్‌ సినిమాలో ఓ తల్లి తన ముగ్గురు కొడుకులకు దూరమై.. ప్రమాదంలో చూపు కూడా కోల్పోతుంది. కానీ, క్లైమాక్స్‌లో ఆమె తన కొడుకులకు చేరువవ్వమే కాకుండా.. ఫ్లోరిడా మహిళ తరహాలోనే ప్రమాదం వల్ల మళ్లీ చూపును తెచ్చుకుంటోంది. ప్రమాదంలో గాయపడిన తల్లి (నిరూప రాయ్‌)కి ముగ్గురు కొడుకులు (వారికి ఆమె తన తల్లి అని తెలియదు) రక్తం ఇవ్వడంతో మళ్లీ చూపు తెచ్చుకున్నట్టు చూపించిన ఆ సీన్‌పై అప్పట్లో అందరూ తేలికగా మాట్లాడారు. ఒక్క సినిమాలో తప్ప నిజజీవితంలో ఇలా జరుగదనీ అన్నారు. ఈ సీన్‌పై జోకులు కూడా వేశారు.

కానీ, ఇప్పుడు అదే తరహాలో ఓ మహిళకు అద్భుతం జరిగిందంటూ రిషి కపూర్ తాజాగా ట్విట్టర్‌లో గుర్తుచేసుకున్నారు. 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమాలో ఆయన అక్బర్‌గా నటించారు. ఆ సినిమాలో చూపిన మెడికల్ మిరాకిల్స్‌ను ప్రస్తావిస్తూ.. 'క్లైమాక్స్‌లో నీతూ నాడీ పట్టుకొని.. ఆమె గర్భవతి అయిన విషయాన్ని పర్వీన్ కన్ఫర్మ్ చేస్తుంది' అని గుర్తుచేశారు. సినిమాల్లో చూపే ఇలాంటి మిరాకిల్స్‌ లాజిక్ ఉండదని మాట్లాడేవారిని ఆయన గట్టిగానే కడిగేశారు. ప్రస్తుతం జరిగిన దానిని ఏమంటారు అంటూ ఆయన వారిని ప్రశ్నించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement