లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’

Laxmi Parvathi Main Role In Radha Krishna Telugu Movie - Sakshi

దివంగత ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘రాధాకృష్ణ’. ప్రసాద్‌ వర్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఢమరుకం శ్రీనివాస్‌ రెడ్డి సమర్పణలో పుష్పాల సాగరిక, శ్రీనివాస్‌ కానురులు సంయుక్తంగా నిర్మించారు. అనురాగ్‌, ముస్కాన్‌ శెట్టిలు జంటగా నటించిన ఈ చిత్రంలో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

‘కనుమరుగవుతున్న నిర్మల్‌ కొయ్య బొమ్మల కథా నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమ కథను చూపించబోతున్నాం. అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని ‘రాధాకృష్ణ’చిత్ర యూనిట్‌ పేర్కొంది. అలీ, కృష్ణ భగవాన్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ శ్రీలేఖ సంగీత మందిస్తున్నారు.

చదవండి:
‘కరెంట్‌ పోయిందంటే కచ్చితంగా మర్డరే’
పది వేల అడుగుల ఎత్తులో...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top