పది వేల అడుగుల ఎత్తులో...

RED Movie songs shooting in Italy - Sakshi

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. కిశోర్‌ తిరుమల  దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో రామ్, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభి మాస్టర్‌ నృత్యాలు సమకూర్చారు. ఇటలీలోని టుస్కాన్, ఫ్లారె¯Œ ్స, డోలమైట్స్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం.

సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్‌లో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్‌లో షూటింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం మాదే. ఇటలీలో ప్రతి ఏటా జరిగే వెనీడియా కార్నివాల్‌లో పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం క్లాస్, మాస్‌ని ఆకట్టుకుంటుంది. ఏప్రిల్‌ 9న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణ పోతినేని. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్‌ రెడ్డి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top