లవ్‌ అండ్‌ వార్‌ | Law Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

లవ్‌ అండ్‌ వార్‌

Nov 6 2018 12:46 AM | Updated on Nov 6 2018 12:46 AM

Law Movie Trailer Launch - Sakshi

పూజా రామచంద్రన్, కమల్, మౌర్యాణి

కమల్‌ కామరాజ్, మౌర్యాణి, పూజా రామచంద్రన్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘లా’ (లవ్‌ అండ్‌ వార్‌). గగన్‌ గోపాల్‌ ముల్క దర్శకత్వంలో రమేష్‌ బాబు మున్నా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ‘‘కమల్‌ హీరోగానే కాదు.. కథ బాగా రావడానికి సహకరించారు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి.. బాగోకపోతే వందమందికి చెప్పండి... కానీ సినిమాని చూడండి’’ అన్నారు గగన్‌ గోపాల్‌.

‘‘లా’తో హీరోగా నేను రీ లాంచ్‌ అంటున్నారు. అవేమీ పెద్దగా నమ్మను. ఈ సినిమాకి మొదటి హీరో స్క్రీన్‌ప్లే. ‘లా’ని ఫాలో చేయకపోవడం  హీరోయిజం అనుకుంటాం. బేసిక్‌ కామన్‌ సెన్స్‌ వాడితే అందరూ ‘లా’ని ఫాలో అయినట్లే’’ అని కమల్‌ కామరాజ్‌ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్‌ కుమార్, సంగీతం: సత్య కశ్యప్, సహ నిర్మాత: మద్దిపాటి శివ.

Advertisement
 
Advertisement
Advertisement