తెలుగు వెండితెరపై మాజీ సీఎం తనయుడు! | Kumaraswamy's son nikhil kumar gowda entry to telugu film industry! | Sakshi
Sakshi News home page

తెలుగు వెండితెరపై మాజీ సీఎం తనయుడు!

Jun 13 2016 1:06 PM | Updated on Sep 4 2017 2:23 AM

తెలుగు వెండితెరపై మాజీ సీఎం తనయుడు!

తెలుగు వెండితెరపై మాజీ సీఎం తనయుడు!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్ త్వరలో సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం.

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్ త్వరలో తెలుగు సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం. కన్నడ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రం ద్వారా అతడు శాండల్ వుడ్కు పరిచయం కాబోతున్నాడు. కాగా ఊపిరి, బ్రహ్మోత్సవం తదితర చిత్రాలను నిర్మించి భారీ నిర్మాణ సంస్థగా పేరు పొందిన పీవీపీ నిర్మాణ సంస్థ ద్వారా నిఖిల్ కుమార్ తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు దర్శకుడు కానీ, పీవీపీ నిర్మాణ సంస్థగానీ, హీరో నిఖిల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నిఖిల్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement