నో పెయిన్‌... నో గెయిన్‌! | kriti sanon social media gym viral | Sakshi
Sakshi News home page

నో పెయిన్‌... నో గెయిన్‌!

Mar 12 2018 5:22 AM | Updated on Oct 22 2018 6:05 PM

kriti sanon social media gym viral - Sakshi

కృతీసనన్‌

ఫస్ట్‌ వామప్‌..నెక్ట్స్‌ స్మాల్‌ రన్‌. ఆ నెక్ట్స్‌ స్మాల్‌ స్మాల్‌ ఎక్స్‌రసైజ్‌లు.. జనరల్‌గా వర్కౌట్స్‌ నుంచి లాంగ్‌ బ్రేక్‌ వచ్చిన తర్వాత ఇలానే ఫాలో అవుతారు రీ–స్టార్ట్‌ చేయడానికి. కానీ..హీరోయిన్‌ కృతీసనన్‌ మాత్రం చాలా డిఫరెంట్‌గా వర్కౌట్స్‌ స్టార్ట్‌ చేశారు. ఏకంగా 120 కేజీల బరువును లెగ్స్‌తో హ్యాండిల్‌ చేసే వర్కౌట్‌ను స్టార్ట్‌ చేశారామె. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘ వర్కౌట్స్‌ చేయడంలో లాంగ్‌ గ్యాప్‌ వచ్చింది. కానీ.. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అస్టిన్‌ డైరెక్ట్‌గా 120 కేజీల వెయిట్‌ ఉన్న లెగ్‌ ప్రెస్‌ వర్కౌట్‌ను స్టార్ట్‌ చేయమన్నారు. చాలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు కృతీసనన్‌.

పక్కనున్న ఫొటో చూసి... నో పెయిన్‌.. నో గెయిన్‌ అంటున్నారు ఆమె అభిమానులు. ఇంకా లైఫ్‌ గురించి ఆమె మాట్లాడుతూ –‘‘ఆర్డినరీ లైఫ్‌ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ది బెస్ట్‌ లైఫ్‌ని కోరుకుంటాం. నిజానికి ఆర్డినరీగా ఉండే మన డెయిలీ లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ మనల్ని ఎంతో హ్యాపీగా ఉంచుతాయి. చిన్నప్పుడు సూర్యోదయం,  చిన్నపిల్లల నవ్వు, రేడియోలో పాత పాటలు వినడం, పాత స్నేహితులతో సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేయడం... ఇలాంటి మూమెంట్స్‌ ఎంతో సంతోషాన్నిస్తాయి. ఇలా లైఫ్‌లో సంతోషాన్నిచ్చే ప్రతి మూమెంట్‌ను ఆస్వాదించి ఆనందంగా ఉండండి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement