కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నట సామ్రాట్‌’..! | Krishna Vamsi to Remake Natsamrat With Prakash Raj | Sakshi
Sakshi News home page

Nov 24 2018 3:46 PM | Updated on Nov 24 2018 3:47 PM

Krishna Vamsi to Remake Natsamrat With Prakash Raj - Sakshi

ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీనియర్‌ డైరెక్టర్‌ హిట్ సినిమా ఇచ్చి చాలా ఏళ్లే అవుతుంది. నక్షత్రం సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న కృష్ణ వంశీ త్వరలో ఓ రీమేక్‌ సినిమాతో రెడీ అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ ప్రధాన పాత్రలో నటించిన మరాఠి సినిమా నట సామ్రాట్‌ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నానా పాత్రలో తన ఆస్థాన నటుడు ప్రకాస్‌ రాజ్‌ ను తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి ఈ రీమేక్‌ సినిమాతో అయినా కృష్ణవంశీకి సక్సెస్‌ వస్తుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement