breaking news
Natsamrat
-
కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నట సామ్రాట్’..!
ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీనియర్ డైరెక్టర్ హిట్ సినిమా ఇచ్చి చాలా ఏళ్లే అవుతుంది. నక్షత్రం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణ వంశీ త్వరలో ఓ రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన మరాఠి సినిమా నట సామ్రాట్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నానా పాత్రలో తన ఆస్థాన నటుడు ప్రకాస్ రాజ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి ఈ రీమేక్ సినిమాతో అయినా కృష్ణవంశీకి సక్సెస్ వస్తుందేమో చూడాలి. -
'ఆ సినిమా తప్పక చూడాలి'
ముంబై: నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించిన మరాఠీ సినిమా 'నటసామ్రాట్'ను ఆమిర్ ఖాన్ ప్రశంసించాడు. నానాపటేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అందరూ తప్పక చూడాలని కోరారు. 'మంగళవారం రాత్రి నటసామ్రాట్ చిత్రం చూశాను. సినిమా చాలా బాగుంది. నానాపటేకర్ నటన అద్భుతంగా ఉంది. నిజంగా నానా నటన సూపర్బ్. విక్రమ్ గోఖలే నటన ఆకట్టుకుంది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీసినందుకు మంజ్రేకర్, నానాపటేకర్, విక్రమ్ జీ, చిత్రయూనిట్ కు థ్యాంక్స్' అని ఆమిర్ ఖాన్ ట్విటర్ లో పేర్కొన్నాడు. స్వర్గీయ వివి శిరవాద్కర్ ప్రముఖ నాటకం కుసుమగ్రాజ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. 'నటసామ్రాట్'లో గణపతి రామచంద్ర బెల్ వాకర్ పాత్రలో నానాపటేకర్ నటించాడు. విలియం షేక్స్ స్పియర్ నాటకాలతో నటసామ్రాట్ గా ఎదిగిన సీనియర్ ధియేటర్ ఆర్టిస్టు ఆ తర్వాత ఎలా పతనమైయ్యాడనే కథతో ఈ సినిమా సాగుతుంది. మేధా మంజ్రేకర్, మృణ్మమయి దేశ్ పాండే, అజిత్ పరబ్, సుశీల్ బార్వే తదితరులు ఈ చిత్రంలో నటించారు. I saw Natsamrat last night. What a film! And what an amazing performance by Nana, truly 'ase nat hone nahi'! (1/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016 A must watch for all who love performances! And Vikramji has done no less. Outstanding! Both Nana& Vikramji kept me riveted throughout!(2/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016 Thank you Mahesh, Nana, Vikramji, and to the entire team. (3/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016