పదమూడేళ్లకు మళ్లీ? | Koratala Shiva In Talks With Trisha For Chiranjeevi Next Movie | Sakshi
Sakshi News home page

పదమూడేళ్లకు మళ్లీ?

Sep 28 2019 1:17 AM | Updated on Sep 28 2019 1:17 AM

Koratala Shiva In Talks With Trisha For Chiranjeevi Next Movie - Sakshi

పీరియాడిక్‌ లుక్‌ నుంచి లేటెస్ట్‌ లుక్‌లోకి మారిపోయారు చిరంజీవి. వెయిట్‌ తగ్గిపోయి యంగ్‌ లుక్‌లోకి వచ్చేశారు. కొరటాల శివతో చేయబోయే సినిమా కోసమే ఈ లుక్‌ అని తెలిసిందే. త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లడానికి మొత్తం సిద్ధం చేస్తోంది టీమ్‌. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై క్లారిటీ లేదు. లేటెస్ట్‌గా చిరంజీవితో త్రిష జోడీ కడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇందులో హీరోయిన్‌గా నయనతార, శ్రుతీహాసన్, తమన్నా.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో  త్రిష పేరు చేరింది. ఇది వరకు చిరంజీవి, త్రిష ‘స్టాలిన్‌’ (2006) సినిమాలో జోడీగా నటించారు. ఒకవేళ ఈ జోడీ షురూ అయితే మళ్లీ పదమూడేళ్ల గ్యాప్‌ తర్వాత కలసి నటించినట్టు అవుతుంది. ఈ సినిమాకు బాలీవుడ్‌ సంగీత దర్శకులు అజయ్‌–అతుల్‌ సంగీతం అందించనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement