‘వైల్డ్‌ డాగ్‌’గా కింగ్‌ నాగార్జున | King Nagarjuna As Vijay Varma In Wild Dog | Sakshi
Sakshi News home page

కింగ్‌ కొత్త సినిమా; ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Dec 27 2019 6:47 PM | Updated on Dec 27 2019 7:09 PM

King Nagarjuna As Vijay Varma In Wild Dog - Sakshi

కింగ్‌ నాగార్జున ‘మన్మథుడు 2’ సినిమాతో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్నాడు. 60 ఏళ్ల వయసులోనూ సోగ్గాడుగా అదుర్స్‌ అనిపించిన నాగ్‌ ఈ దెబ్బతో డీలాపడిపోయాడు.  మరోసారి చేతులు కాల్చుకోకుండా ఉండేందుకు సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా సైలెంట్‌గా ఓ కొత్త సినిమాకు సైన్‌ చేశాడు. తాజాగా ఈ సినిమా గురించి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ట్విటర్‌ వేదికగా సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్‌ చేశాడు.

‘వైల్డ్‌ డాగ్‌’ అనే టైటిల్‌ కొత్తగా ఉండటంతో పాటు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్ర ఫస్ట్‌ లుక్‌లో నాగ్‌ పంజా విసరటానికి సిద్ధంగా ఉన్న పులిలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ్‌.. విజయ్‌ వర్మ అనే దర్యాప్తు అధికారిగా కనిపించనున్నాడు. గగనం తర్వాత నాగ్‌ రెండోసారి సీక్రెట్‌ ఏజెంట్‌గా అవతారం ఎత్తాడు. కాగా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అహిషోన్‌ సోలమన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఈ పాటికే పూర్తయిందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement