‘మ‌న్మథుడు 2’ ఫ్యామిలీతో కింగ్ | King Nagarjuna with Manmandhudu 2 Family | Sakshi
Sakshi News home page

‘మ‌న్మథుడు 2’ ఫ్యామిలీతో కింగ్

Apr 2 2019 10:09 AM | Updated on Jul 15 2019 9:21 PM

King Nagarjuna with Manmandhudu 2 Family - Sakshi

కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మ‌న్మథుడు 2’. ఈ సినిమా షూటింగ్‌ గ‌త వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చర్స్ తో కలిసి నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ ర‌వీంద్రన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ ఇంట్రస్టింట్‌ అప్‌డేట్ ఇచ్చారు నాగార్జున.

చిత్ర యూనిట్ సభ్యుల‌తో క‌లిసి సెల్ఫీ దిగిన నాగ్‌ ఆసెల్పీని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు. ‘నేను నా మ‌న్మథుడు 2 ఫ్యామిలీ!!! ల‌వింగ్ ఇట్‌’ అని కామెంట్ చేశారు. ఈ సెల్ఫీలో నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్‌ సింగ్‌‌, రాహుల్ ర‌వీంద్రన్‌, సీనియర్‌ నటి ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ త‌దిత‌రులున్నారు.

ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఆర్ట్‌ డైరెక్టర్ రామ‌కృష్ణ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక‌మైన సెట్‌లో ప్రధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.  చైత‌న్య భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement