ఆ సమయంలో నగ్నంగా ఉన్నాను: నటి

Kim Kardashian Told That She Was Nude When Donald Trump Calls her - Sakshi

హాలీవుడ్‌ నటి, రియాలిటి టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ తన గ్రాండ్‌ మదర్‌ అలైస్‌ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించమని అభ్యర్థించడం.. అందుకు పెద్ద మనస్సు చేసుకొని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించడం తెలిసిందే. ఆ మధ్య ఓ కేసులో శిక్షపడిన బాక్సర్‌కు ట్రంప్‌ క్షమాభిక్ష ప్రసాదించడంతో.. తన నాయనమ్మపై కూడా కనికరం చూపాలని ఆయనను కిమ్‌ కోరారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ట్రంప్‌.. నిందితురాలు అలైస్‌ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించి.. జైలుశిక్ష నుంచి విముక్తి కల్పించారు. 

అయితే ఈ ఉదంతానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కిమ్‌ తాజాగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. అప్పట్లో తనతో మాట్లాడటానికి ట్రంప్‌ ఫోన్‌ చేశారని, ఆ సమయంలో తాను నగ్నంగా ఉన్నానని ఒకింత సిగ్గుపడుతూ చెప్పారు.  తను న్యూడ్‌ ఫోటో షూట్‌ చేస్తుండగా.. కాల్‌ వచ్చిందని.. తీరా చూస్తే అది అమెరికా ప్రెసిడెంట్‌ నుంచి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ స్టీవెన్ క్లైన్‌ తన న్యూడ్‌ ఫోటో షూట్‌ తీస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top