థ్రిల్లింగ్‌ కిల్లర్‌

killer movie released on june 7 - Sakshi

యాక్షన్‌ కింగ్‌ అర్జున్, విజయ్‌ ఆంటోని నటించిన చిత్రం ‘కొలైగారన్‌’. దియా మూవీస్‌ బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘కిల్లర్‌’ పేరుతో టి. నరేశ్‌ కుమార్, టి.శ్రీధర్‌ విడుదల చేస్తున్నారు. ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వం వహించారు. రంజాన్‌ పండగ సందర్భంగా జూన్‌ 7న ‘కిల్లర్‌’ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అర్జున్, విజయ్‌ ఆంటోనిలకు ఉన్న క్రేజ్‌తో ఇప్పటికే తెలుగులో మంచి బిజినెస్‌ జరిగింది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చి్రత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సైమన్‌ కె. కింగ్‌ అందించిన పాటలు ఓ హైలైట్‌’’ అన్నారు. ఆశిమా నర్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, సంపత్‌రాజ్‌ తదితరులు నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top