పహిల్వాన్‌ వస్తున్నాడు

Kicha Sudeep Pahilwan Movie Grand Release - Sakshi

‘ఈగ’తో ఇబ్బందులు పడి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌. తాజాగా ‘పహిల్వాన్‌’ అనే చిత్రంలో నటించారాయన. ఇందులో మల్ల యోధుడి పాత్రలో కనిపించనున్నారు. కన్నడంలో రూపొందిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌ తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. ఎస్‌. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, ఆకాంక్ష సింగ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘ఆల్రెడీ రిలీజయిన ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్ట్‌ 29న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశాం’’ అని నిర్మాతలు తెలిపారి. ‘కేజిఎఫ్‌’ను తెలుగులో రిలీజ్‌ చేసింది వారాహి బ్యానరే కావడం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top