జీవితమంటే ఆట కాదు

khel movie first look release - Sakshi

రాఘవసాయి, నాగబాబు, చాణక్య హీరోలుగా స్నేహాల్‌కామత్, మమతారెడ్డి, దీక్ష హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖేల్‌’. ‘లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఏ గేమ్‌’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో శరత్‌ కుమార్‌. ఆర్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. గ్లోబల్‌ మోషన్‌ పిక్చర్స్‌ సమర్పణలో మాన్సీ మూవీస్‌ పతాకంపై గొట్టిముక్కల పాండురంగారావు, పులి అమృత్‌గౌడ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌ రెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో హైదరాబాద్‌ సినిమా హబ్‌గా మారనుంది. షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ సౌకర్యాల కోసం సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ‘ఖేల్‌’ సినిమా విజయవంతం కావాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు యు. సత్యనారాయణ, కూకట్‌పల్లి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌ సాధనాల, సంగీతం: ఆనంద్‌ అవసరాల, సహ నిర్మాత: పులి అమృత్‌గౌడ్‌.
 ∙పి. మహేందర్‌ రెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, బి. వినోద్‌ కుమార్, పులి అమృత్‌ గౌడ్, జి. పాండురంగా రావు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top