కేటుగాడి ప్రేమకథ | Ketugadi love story | Sakshi
Sakshi News home page

కేటుగాడి ప్రేమకథ

Aug 16 2015 11:24 PM | Updated on Sep 3 2017 7:33 AM

కేటుగాడి ప్రేమకథ

కేటుగాడి ప్రేమకథ

ఆపదలో ఉన్న అమ్మాయి ప్రాణాలు కాపాడటానికి ఓ యువకుడు ఎలా పోరాడాడు? ఆ క్రమంలో ఆ అమ్మాయితో ఎలా లవ్‌లో పడిపోయాడనే

ఆపదలో ఉన్న అమ్మాయి ప్రాణాలు కాపాడటానికి ఓ యువకుడు ఎలా పోరాడాడు? ఆ క్రమంలో ఆ అమ్మాయితో ఎలా లవ్‌లో పడిపోయాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కేటుగాడు’. తేజస్, చాందినీ చౌదరి జంటగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ బాలసాని నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. తేజస్ మాట్లాడుతూ -‘‘నా తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత నేనీ స్థాయిలో ఉండటానికి కారణం కె.ఎస్. రామారావు గారు, ప్రకాశ్‌రాజుగారు. వారిద్దరూ సినిమా చూసి చాలా బాగుందని అభినందించారు’’ అని చెప్పారు. ‘‘సినిమా క్వాలిటీతో రావడానికి నిర్మాత చాలా బాగా సహ కరించారు’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ఒక డిఫరెంట్ పాయింట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తీశారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అచ్చిబాబు ఎం. సంపత్ కుమార్.
 

Advertisement
 
Advertisement
Advertisement