పెంగ్విన్ టీజ‌ర్‌: సైకో ఎవ‌రు? | Keerthy Suresh Penguin Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

'అంద‌రి క‌థ మొద‌ల‌య్యేది ఆమె నుంచే'

Jun 8 2020 3:24 PM | Updated on Jun 8 2020 4:10 PM

Keerthy Suresh Penguin Movie Teaser Out Now - Sakshi

'పెంగ్విన్'.. ఓ త‌ల్లి ప్రేమ క‌థ.. అంటే, ఆట‌లు, పాట‌లు, అల్ల‌ర్లతో సాగే సంతోష‌క‌ర‌మైన‌ కథ కాదు. అప‌హ‌ర‌ణ‌కు గురైన కొడుకు కోసం త‌ల్లి ప‌డే వేద‌న‌, కొడుకును ద‌క్కించుకునేందుకు చేసే పోరాటం.. వెర‌సి ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కింది. మ‌హాన‌టితో ఉత్త‌మ జాతీయ న‌టిగా అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత సోమ‌వారం ఈ చిత్ర‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. హిందీలో తాప్సీ, త‌మిళ్‌లో త్రిష‌, మల‌యాళ టీజ‌ర్‌ను మంజు వారియ‌ర్ విడుద‌ల చేశారు. 'మీ అంద‌రి క‌థ‌ల వెనుక ఓ అమ్మ క‌థ ఉంది. ఎందుకంటే మీ ప్ర‌యాణం ప్రారంభించేది ఆమె నుంచే..' అని టీజ‌ర్‌లో చూపించారు. (పెంగ్విన్‌ కూడా ఓటీటీ వైపే?)

పెంగ్విన్ టీజ‌ర్‌లో కీర్తి త‌ప్పిపోయిన‌ త‌న కొడుకు కోసం వెతుకుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. టీజ‌ర్ చివ‌రిలో ఎవ‌రినో న‌రుకుతూ క‌నిపించిన‌ సైకో ఎవ‌రు? అనేది ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగిన ఈ టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ నెల 11న పెంగ్విన్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు‌. నూతన దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను "పేట" దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మించారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్‌ ఊటీలో జరిపారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఈ చిత్రం డిజిట్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది. (ఉప్మా తినేసింది.. హీరోయిన్‌ అయ్యింది..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement