పెంగ్విన్‌ కూడా ఓటీటీ వైపే? | Heroine Keerthi Suresh Acting In Penguin Movie | Sakshi
Sakshi News home page

పెంగ్విన్‌ కూడా ఓటీటీ వైపే?

May 13 2020 3:46 AM | Updated on May 13 2020 3:46 AM

Heroine Keerthi Suresh Acting In Penguin Movie - Sakshi

కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రం ‘పెంగ్విన్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. నూతన దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మించారు. ఇందులో గర్భవతి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్‌ ఊటీలో జరిపారు. ఈ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా విడుదల పరిస్థితి అయోమయంగా మారింది. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని టాక్‌. అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమాను జూన్‌ మొదటివారంలో విడుదల చేయడానికి చర్చలు నడుస్తున్నాయట. ఆల్రెడీ తమిళంలో జ్యోతిక నటించిన ‘పొన్‌ మగళ్‌ వందాళ్‌’ చిత్రాన్ని కూడా డిజిటల్‌ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చూడబోతుంటే.. లాక్‌ డౌన్‌ కారణంగా మరిన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్‌ కాకుండానే డిజిటల్‌ కి వచ్చేట్లున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement