‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పీరియడ్‌ డ్రామనే..! | Keeravani Reveals Intresting Details About RRR Movie | Sakshi
Sakshi News home page

Jan 5 2019 1:20 PM | Updated on Jul 14 2019 4:05 PM

Keeravani Reveals Intresting Details About RRR Movie - Sakshi

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్‌ టైటిల్‌). టాలీవుడ్ టాప్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. రాజమౌళితో పాటు ఇతర చిత్రయూనిట్ అంతా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ బైటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ సినిమా ఎనౌన్స్‌ అయిన దగ్గర నుంచి మూవీ పీరియాడిక్‌ డ్రామా అన్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా యన్‌.టి.ఆర్‌ ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంగీత దర్శకుడు కీరవాణి, ఆర్‌ఆర్‌ఆర్‌ స్టోరిపై హింట్‌ ఇచ్చారు. ఈ సినిమా పని తాను మార్చిలో ప్రారంభిస్తానన్న కీరవాణి, ఈ సినిమాలో తన మ్యూజిక్‌ పీరియడిక్‌, ట్రెండీల ఫ్యూజన్‌ల ఉండబోతుందన్నారు. దీంతో సినిమా కూడా పీరియాడిక్‌ జానర్‌లోనే తెరకెక్కుతుందన్న టాక్‌కు మరింత బలం చేకూరినట్టైంది. మరి ఇప్పటికైన చిత్రయూనిట్‌ స్పందిస్తారేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement