‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

Keeravani Musical Jaamu Raathiri Rekindled From Kshana Kshanam - Sakshi

వెంకటేష్‌, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా క్షణ క్షణం. 1990లో రిలీజ్‌ అయిన ఈసినిమాలో జాము రాతిరి జాబిలమ్మ పాట సూపర్‌ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా, ఆ పాట విడుదలై 29 ఏళ్లు పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు జామురాతిరి జాబిలమ్మ పాటను సరికొత్తగా అందించారు కీరవాణి టీం.

కీరవాణి టీంలో ఉన్న యువతరం గాయనీ గాయకులు ఈ పాటను సరికొత్తగా ఆలపించి రిలీజ్ చేశారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌లో చిత్రీకరించిన విజువల్స్‌తో వేల్‌ రికార్డ్స్ ద్వారా పాటను రీమిక్స్‌ చేసి విడుదల చేశారు. అప్పట్లో బాలు, చిత్రలు ఈ పాటను ఆలపించగా రీమిక్స్‌ వర్షన్‌లో హేమ చంద్ర, కాలభైరవ, మనీష, దీపు, దామిని, మౌనిమ, శృతి, నోయల్‌ సీన్‌, పృథ్వీ చంద్రలు ఆలపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top