'ఆమె కాళ్లు నిజంగా అద్భుతం' | Katrina Kaif for possessing amazing legs | Sakshi
Sakshi News home page

'ఆమె కాళ్లు నిజంగా అద్భుతం'

Sep 26 2015 8:57 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఆమె కాళ్లు నిజంగా అద్భుతం' - Sakshi

'ఆమె కాళ్లు నిజంగా అద్భుతం'

బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇటీవలే పరిచయమైన భామ అప్పుడే తోటి నటీనటులపై ప్రశంసల జల్లులు కురిపించింది.

ముంబయి : బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇటీవలే పరిచయమైన భామ అప్పుడే తోటి నటీనటులపై ప్రశంసల జల్లులు కురిపించింది. విషయమేమంటే.. 'హీరో' మూవీతో వెండితెరకు పరిచయమైన అతియా శెట్టి, సీనియర్ హీరో అక్షయ్ కుమార్ను తెగపొగిడేస్తోంది. అతియా సీనియర్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల తనయ అన్న విషయం అందరికి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిట్ గా ఉన్న హీరో అక్షయ్ అని చెప్పింది. ఆయన ఆహార నియమాలను చాలా బాగా పాటించడం వల్ల ఆయన అంత ఆరోగ్యంగా, ఫిట్ నెస్ గా కనిపిస్తాడన్నది ఈ ముద్దుగుమ్మ.

హీరోయిన్ల విషయానికొస్తే.. ఆమె కాళ్లు చాలా అందంగా ఉంటాయని, ఆమె ఎప్పుడూ ఫిట్ నెస్ గా కూడా కనిపిస్తుందంటూ కత్రినా కైఫ్ ని గురించి ప్రస్తావించింది. ఫిట్ నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచివాలాకు సంబంధించిన ఓ కార్యక్రమానికి 'హీరో' జోడీ అతియా శెట్టి, సూరజ్ పంచోలి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతియా మాట్లాడుతూ కత్రినా, అక్షయ్ల ఫిట్ నెస్ గురించి చెప్పుకొచ్చింది. బాలీవుడ్ పాపులర్ జోడీలో అక్షయ్, కత్రినాలు ఉంటారని ఈ భామ చెప్పింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదరటం వల్ల వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్లు ఉన్నాయని అతియా అభిప్రాయపడింది.

Advertisement
 
Advertisement
Advertisement