'కాటమరాయుడు' వచ్చేస్తున్నాడు | Katama Rayudu New Year Poster | Sakshi
Sakshi News home page

'కాటమరాయుడు' వచ్చేస్తున్నాడు

Dec 31 2016 10:30 AM | Updated on Mar 22 2019 5:33 PM

'కాటమరాయుడు' వచ్చేస్తున్నాడు - Sakshi

'కాటమరాయుడు' వచ్చేస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఇప్పటికే రెండు ప్రీ లుక్ పోస్టర్స్తో ఊరించిన పవన్, ఫైనల్గా ఫేస్ చూపించాడు. తమిళ సినిమా వీరంకు రీమేక్గా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమాలో పవన్ ఫ్యాక్షన్ లీడర్గా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్తో సినిమాలో పవన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించేశారు. ఈ రోజు(డిసెంబర్ 31) అర్ధరాత్రి ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేయనున్నారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తుండగా అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement