ఆ వీడియో డిలీట్‌ చేసిన హీరో.. | Kartik Aaryan Deletes His Tiktok Roti Video After Backlash On Social Media | Sakshi
Sakshi News home page

కార్తిక్‌ ఆర్యన్‌పై నెటిజన్ల ఫైర్‌.. ఆ తర్వాత!

Apr 22 2020 8:34 PM | Updated on Apr 22 2020 8:39 PM

Kartik Aaryan Deletes His Tiktok Roti Video After Backlash On Social Media - Sakshi

బాలీవుడ్‌ యువహీరో కార్తీక్‌ ఆర్యన్ ‌ఇంట్లో తన సోదరితో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియోలను షేర్‌ చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. లాక్‌డౌన్‌లో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న కార్తిక్‌ తన సోదరి కిృతికతో కలిసి ఫన్నీ టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ.. తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన చెల్లితో కలిసి చేసిన రోటీ టిక్‌టాక్‌ వీడియాను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం షేర్‌ చేశాడు. (కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌)

ఈ వీడియోలో కార్తీక్‌ తన సోదరి కిృతిక చేసిన చపాతిని తింటాడు. ఆ చపాతి రుచిగా లేకపోవడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టేస్తాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు గృహహింసను ప్రోత్సహించేలా ఉందంటూ కార్తిక్‌పై మండిపడ్డారు. అంతేగాక కార్తీక్‌ గతంలో నటించిన ‘ప్యార్‌ కా పుంచ్నామా’, ‘సోను కే టిటుకి స్వీటీ’ వంటి సినిమాల్లో మహిళలపై చేయి చేసుకునే పాత్రలను ఈ సందర్భంగా ఎత్తి చూపుతూ.. కార్తీక్‌పై విమర్శలు గుప్పించారు.ఇక నెటిజన్ల కామెంట్స్‌ చూసిన కార్తిక్‌ వెంటనే ఈ వీడియోను ఇన్‌స్టా నుంచి డిలీట్‌ చేశాడు. కాగా ప్రస్తుతం కార్తీక్‌ ‘దొస్తానా -2 ’, ‘భూల్ భూలైయా 2’ లతో పాటు ‘తన్హాజీ’ దర్శకుడు ఒం రౌత్‌ రూపోందిస్తున్న 3డీ యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.చదవండి: కపిల్‌ దేవ్‌ గుండు.. ఆమే కారణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement