చేదు అనుభవాలు ఎదురయ్యాయి | kangana ranaut wedding plans | Sakshi
Sakshi News home page

చేదు అనుభవాలు ఎదురయ్యాయి

Mar 4 2019 3:51 AM | Updated on Aug 21 2019 10:25 AM

kangana ranaut wedding plans - Sakshi

కంగనా రనౌత్‌

గతేడాది ప్రియాంకా చోప్రా, సోనమ్‌ కపూర్, దీపికా పదుకోన్‌లతో పాటు మరికొందరు బాలీవుడ్‌ కథానాయికలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి..‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని 31 ఏళ్ల కంగనా రనౌత్‌ని అడిగితే–‘‘ప్రేమ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. నా రొమాంటిక్‌ యాంగిల్‌ నాకు ఉంది. ప్రేమలో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ తొందరగానే జీవితంలో ముందుకు వెళ్లగలిగాను. ప్రేమ పట్ల నా ఆలోచనా ధోరణి కూడా మారింది. మంచి కుటుంబం కావాలి. లైఫ్‌లో నన్ను ఇన్‌స్పైర్‌ చేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు కంగనా. ప్రస్తుతం ‘పంగా’ సినిమాతో బిజీగా ఉన్నారు కంగనా రనౌత్‌.

Advertisement
 
Advertisement
Advertisement