ఇంకెవరైనా మిగిలారా?

Kangana Ranaut new film Dhaakad First launch - Sakshi

నిప్పుల రణరంగంలోకి ఎర్రటి చూపులతో ఆగ్రహంగా అడుగుపెట్టారు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌. రెండు చేతుల్లో తుపాకులను పట్టుకుని ఇంకెవరైనా మిగిలారా? అంటూ ఆ  రణరంగంలోని ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. కంగనా రనౌత్‌ నటించనున్న తాజా యాక్షన్‌ చిత్రం ‘థాకడ్‌’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఇంటర్‌నేషనల్‌ డైరెక్టర్‌ రజ్‌నీష్‌ రాజీ ఘయ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

‘‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమా సక్సెస్‌ తర్వాత ఫీమేల్‌ యాక్షన్‌ సినిమాల పట్ల ఆడియన్స్‌ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా నా కెరీర్‌లో ఒక బెంచ్‌ మార్క్‌లా నిలిచిపోవడమే కాదు.. ఇండియన్‌ సినిమాకు ఒక టర్నింగ్‌ పాయింట్‌లా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని కంగనా రనౌత్‌ అన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలను కుంటున్నారు. ఇంకా ‘జడ్జ్‌మెంటల్‌హై క్యా?’ కంగనా నెక్ట్స్‌ రిలీజ్‌. ఈ సినిమాలో రాజ్‌కుమార్‌ రావు హీరో. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కంగనా రనౌత్‌ నటించిన ‘పంగా’ సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top