లంచ్‌ ఆల్సో.. వర్క్‌ ఆల్సో...

Kangana Ranaut hosts lunch for the team of Panga and it was full of fun, laughter and work - Sakshi

ఇక్కడ ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటోలో కంగనా రనౌత్‌ను చూశారుగా! కంగనా ముఖం మీద కనిపించే రక్తం అంతా తనది కాదు. కొంచెం శత్రువులది కూడా. అవును.. కంగనా రనౌత్‌ ప్రస్తుతం యాక్షన్‌ మోడ్‌లో ఉన్నారు. ఆమె టైటిల్‌ రోల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకుడు. ప్యాచ్‌ వర్క్‌ నిమిత్తం ఈ సినిమాకు తాత్కాలిక దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు కంగనా రనౌత్‌. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌ ఈ యాక్షన్‌ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు.

ఈ యాక్షన్‌ సన్నివేశాల్లో కత్తి పట్టి శత్రువులు అంతు చూస్తున్నారట కంగనా. అలాగే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న సోనూ సూద్‌ ప్లేస్‌లో మహ్మాద్‌ జీషన్‌ అయూబ్‌ రీప్లేస్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తుందని బాలీవుడ్‌ టాక్‌.  సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... అశ్వనీ అయ్యర్‌ తివారి దర్శకత్వంలో కంగనా రనౌత్‌ ముఖ్య పాత్రలో కబడ్డీ నేపథ్యంలో రూపొందనున్న ‘పంగ’ సినిమా పనులు కూడా మొదలయ్యాయి. రీసెంట్‌గా ఈ టీమ్‌ అంతా కంగనా ఇంట్లో లంచ్‌ చేశారు. ఓన్లీ లంచ్‌ మాత్రమే కాదు వర్క్‌ గురించి కూడా మాట్లాడుకున్నారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో ‘లవర్‌ ఆల్సో.. ఫైటర్‌ ఆల్సో..’లా ‘లంచ్‌ ఆల్సో.. వర్క్‌ ఆల్సో’  అన్నమాట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top