కళ్యాణ్‌ రామ్‌ నా నువ్వే టీజర్‌ విడుదల

Kalyan Ram Naa Nuvve First Glimpse Released - Sakshi

ఇజం అంతగా సక్సెస్‌ కాకపోవటంతో కాస్త గ్యాప్‌ తీసుకున్న నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ వరుసపెట్టి ప్రాజెక్టులు కమిట్‌ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉపేంద్ర డైరెక్షన్‌లో కాజల్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఎమ్మెల్యే కాగా, మరోకటి ‘180’ చిత్రం ఫేమ్‌ జయేంద్ర పంచపకేశన్ డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రం. 

ఇక జయేంద్ర చిత్ర టీజర్‌ను ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరిట నేడు చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ‘నా నువ్వే’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసేశారు.  రేడియో జాకీ మీరా పాత్రలో తమన్నాను.. ఆమె కోసం పరితపించే వరుణ్‌ అనే యువకుడి పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ను చూపించారు. పుస్తకాల మధ్యలో కళ్యాణ్‌ రామ్‌ను కట్టేసి ఉన్న సీన్లు విచిత్రంగా ఉన్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ ​స్కోర్‌లో వినిపించిన ప్రేమిక ట్యూన్‌ ఆకట్టుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఈ చిత్రానికి వర్క్‌ చేశారు.

మొత్తానికి ఓ ఎమోషనల్‌ అండ్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమౌతోంది. సమ్మర్‌లో నా నువ్వే విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top