రాజుగారి గదిలో? | Kajal Aggarwal is the guest of the third royal in 'Rajagari Room-2' | Sakshi
Sakshi News home page

రాజుగారి గదిలో?

Jul 9 2017 12:31 AM | Updated on Jul 15 2019 9:21 PM

రాజుగారి గదిలో? - Sakshi

రాజుగారి గదిలో?

కింగ్‌ నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది–2’లో రాణీల్లాంటి అమ్మాయిలు ఇద్దరున్నారు. వాళ్లు ఎవరు? అంటే... సమంత, సీరత్‌ కపూర్‌.

కింగ్‌ నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది–2’లో రాణీల్లాంటి అమ్మాయిలు ఇద్దరున్నారు. వాళ్లు ఎవరు? అంటే... సమంత, సీరత్‌ కపూర్‌. ఈ ఇద్దరిలో నాగార్జునకు జోడీగా కనిపించే రాణి ఎవరు? అనేది పక్కన పెడితే... ఇప్పుడీ సినిమాలో మూడో రాణి అడుగు పెట్టారనేది తాజా ఖబర్‌.

ఈ రాణీగారు అతిథిగా సందడి చేస్తారట. ఆ రాణి ఎవరో కాదు... కాజల్‌ అగర్వాలే. ‘‘ఆల్రెడీ 10 రోజులు కాజల్‌ ‘రాజుగారి గది–2’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆమె నాగార్జునకు జోడీగా నటిస్తున్నారు. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వార్తను దాచారు’’ అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్‌ థ్రిల్లర్‌ను పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరై్టన్మెంట్, ఓక్‌ ఎంటరై్టన్మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement