breaking news
Sireath Kapoor
-
రాజుగారు గుమ్మడికాయ కొట్టేశారు
రాజుగారు రెండో గదికి గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతానికి గది తలుపులు మూసుకున్నాయ్. వచ్చే నెల 13న థియేటర్ల తలుపులు తెరుచుకుంటాయ్. అప్పుడు రాజుగారు అండ్ కో గదిలో ఏం చేశారనేది అందరికీ తెలుస్తుంది. నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన సినిమా ‘రాజుగారి గది–2’. సమంత, సీరత్ కపూర్, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, ప్రవీణ్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. గుమ్మడికాయ కూడా కొట్టేశారు. చిత్రీకరణ చివరి రోజున నాగార్జున, ‘వెన్నెల’ కిశోర్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను నాగార్జున మ్యాగ్జిమమ్ కంప్లీట్ చేశారు. ఫస్టాఫ్ రీ–రికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్... పూర్తయ్యాయట. మరో పది రోజుల్లో సెకండాఫ్ వర్క్ కూడా పూర్తవుతుంది. వచ్చే నెల 13న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిన్మాలో నాగార్జున మెంటలిస్ట్‌గా, సమంత దెయ్యంగా, సీరత్ డ్యాన్సర్‌గా నటించారు. కాజల్ అగర్వాల్ అతిథి పాత్ర చేశారట. చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
రాజుగారి గదిలో?
కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది–2’లో రాణీల్లాంటి అమ్మాయిలు ఇద్దరున్నారు. వాళ్లు ఎవరు? అంటే... సమంత, సీరత్ కపూర్. ఈ ఇద్దరిలో నాగార్జునకు జోడీగా కనిపించే రాణి ఎవరు? అనేది పక్కన పెడితే... ఇప్పుడీ సినిమాలో మూడో రాణి అడుగు పెట్టారనేది తాజా ఖబర్. ఈ రాణీగారు అతిథిగా సందడి చేస్తారట. ఆ రాణి ఎవరో కాదు... కాజల్ అగర్వాలే. ‘‘ఆల్రెడీ 10 రోజులు కాజల్ ‘రాజుగారి గది–2’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆమె నాగార్జునకు జోడీగా నటిస్తున్నారు. ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వార్తను దాచారు’’ అని ఫిల్మ్‌నగర్ టాక్. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్‌ను పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరై్టన్మెంట్, ఓక్ ఎంటరై్టన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.