ఇండస్ట్రీలోని త్రీ మంకీస్‌ మేమే | K Raghavender Rao Speech At 3 Monkeys Pre Release Event | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీలోని త్రీ మంకీస్‌ మేమే

Feb 6 2020 5:56 AM | Updated on Feb 6 2020 5:56 AM

K Raghavender Rao Speech At 3 Monkeys Pre Release Event - Sakshi

గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ , సుడిగాలి సుధీర్

‘‘ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద వాళ్లున్నా నన్ను, మంచు లక్ష్మి, అలీని ఎందుకు పిలిచారు? మేం ముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని, ఇండస్ట్రీలో ఉన్న త్రీ మంకీస్‌ మేమే అని మమ్మల్ని పిలిచినట్టున్నారు’’ అని డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్‌’ శ్రీను, రాంప్రసాద్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్‌’. కారుణ్య చౌదరి హీరోయి¯Œ గా నటించారు. అనిల్‌ కుమార్‌ జి. దర్శకత్వంలో నగేష్‌ .జి నిర్మించిన ఈ సినిమా రేపువిడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు’ లాంటి టైటిల్స్‌ ఏ హీరోకి పెట్టినా సరిపోతాయి.

‘3 మంకీస్‌’ టైటిల్‌ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడం కంటే ‘జబర్దస్త్‌’ లో చేయడమే కష్టం’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీతో పాటు చిన్న దర్శకులు బాగుంటారు’’అన్నారు నటుడు అలీ. ‘‘మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు నగేష్‌. ‘‘ఇలాంటి పాత్ర చేస్తానని జీవితంలో అనుకోలేదు’’ అన్నారు రాంప్రసాద్‌. ‘‘మా ముగ్గురికీ ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్‌ రాదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్‌. ‘‘ఈ ప్రపంచంలో సాయం అనే మందు లేక చాలా మంది చనిపోతున్నారని మా చిత్రంలో చెప్పాం’’ అన్నారు అనిల్‌. హీరో ఆకాష్‌ పూరి, కారుణ్య చౌదరి, రచయిత అరుణ్, కెమెరామేన్‌ సన్నీ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement