విందు భోజనంలా ఉంటుంది – కీరవాణి | Juvva Movie Audio Launch | Sakshi
Sakshi News home page

విందు భోజనంలా ఉంటుంది – కీరవాణి

Feb 13 2018 12:45 AM | Updated on Feb 13 2018 12:45 AM

Juvva Movie Audio Launch - Sakshi

ఝాన్సీ, బొత్స సత్యనారాయణ, రంజిత్, వీవీ వినాయక్, భరత్, కీరవాణి, పాలక్‌ లల్వాని, త్రికోటి

‘‘ఈ సినిమాకు కీరవాణిగారు సంగీతం అందించటం చాలా గొప్ప విషయం. సినిమా బావుంటుంది అనుకుంటేనే ఆయన సంగీతం అందిస్తారు. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. నటుడిగా రంజిత్‌కు మంచి గుర్తింపు రావాలి’’ అన్నారు దర్శకులు వీవీ వినాయక్‌. రంజిత్, పాలక్‌ లల్వాని జంటగా త్రికోటి దర్శకత్వంలో భరత్‌ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’.

ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినాయక్‌ మాట్లాడుతూ –‘‘మా కుటుంబానికి ఆప్త మిత్రులు బొత్స సత్యనారాయణ గారు. వారి అల్లుడు, ఈ సినిమా నిర్మాత భరత్‌ సోమిగారికి శుభాకాంక్షలు. తమ్ముడి మీద ప్రేమతో రంజిత్‌ను హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘త్రికోటì  మొదటి సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’కి మ్యూజిక్‌ నేనే చేశా. ఈ సినిమా విందు భోజనంలా ఉంటుంది.

రంజిత్‌ ఫ్యూచర్‌లో పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కీరవాణి. ‘‘నాలాంటి కొత్తవాడి సినిమాకు సంగీతం ఇచ్చిన కీర వాణిగారు నాకు దేవుడితో సమానం. బడ్జెట్‌ విషయంలో భరత్‌గారు వెనకాడలేదు’’ అన్నారు త్రికోటి. రంజిత్‌ మాట్లాడుతూ –‘‘నా మెదటి సినిమాకు కీరవాణిగారు మ్యుజిక్‌ ఇవ్వడం నా లక్‌. మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు రంజిత్‌. ‘‘ముఖ్య అతిథిగా వచ్చిన వినాయక్‌గారికి, బొత్స సత్యనారాయణ గారికి, అతిథులందరికి కృతజ్ఞతలు. రత్నం గారి డైలాగ్స్‌ బాగుంటాయి. ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత భరత్‌.

Advertisement
 
Advertisement
Advertisement