‘మజ్ను’ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌..!

Jr NTR Chief Guest To Mr Majnu Pre Release Event - Sakshi

‘అఖిల్‌’ సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూడగా.. హలో సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు అక్కినేని యువ హీరో అఖిల్‌. ఈసారి మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టేందుకు ఈ యంగ్‌ హీరో రెడీ అవుతున్నాడు. ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరితో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. 

ఇప్పటికే విడుదల చేసిన ‘మిస్టర్‌ మజ్ను’ టీజర్‌, సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. జనవరి 19న సాయంత్రం ఆరుగంటలకు హైదరాబాద్‌లో జరుగనున్న ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ హాజరుకాబోతున్నారని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. తొలిప్రేమతో మంచి హిట్‌ను అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top