హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

Janhvi Kapoor Remembers Her Mother Sridevi In Instagram - Sakshi

అందాల నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.  అయినప్పటికీ జాన్వి తన తల్లి శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా..  తల్లితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఫోటోలతో పాటు ‘హ్యాపి బర్త్‌డే అమ్మా .. ఐ లవ్‌ యూ’ అనే కామెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌ను పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు లైక్‌ చేశారు. ఏడాదిన్నర క్రితం అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై, అక్కడే హోటల్‌లోని బాత్‌ టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే.

శ్రీదేవి మొదటి జయంతిని భర్త బోని కపూర్‌ ఆమె తల్లి నివాసం అయిన చెన్నైలో నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో బోని కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘శ్రీదేవిని నా జీవితంలో ప్రతిరోజు మిస్‌ అవుతున్నాను. జీవితంలో హీరోలు, లెజెండ్‌లు ఉంటారు. కానీ హీరోలు జ్ఞాపకం వస్తూ ఉంటారు. కానీ శ్రీదేవి వంటి లెజెండ్‌ ఎప్పుడు మా నుంచి దూరం కాదు. తాను ఎప్పుడూ మాతోనే ఉంటుంది. మీము తనను మిస్‌ కామని’ చెప్పారు. ప్రస్తుతం జాన్వీ రూహి అఫ్జా, కార్గిల్ గర్ల్ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు.


Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top