పెళ్లిపై లులియా కూడా స్పందించింది‌! | Iulia Vantur is in no hurry to get married | Sakshi
Sakshi News home page

పెళ్లిపై లులియా కూడా స్పందించింది‌!

May 21 2016 8:14 PM | Updated on Sep 4 2017 12:37 AM

పెళ్లిపై లులియా కూడా స్పందించింది‌!

పెళ్లిపై లులియా కూడా స్పందించింది‌!

బాలీవుడ్‌ బ్యాచిలర్‌ సల్మాన్‌ ఖాన్‌ను తాను పెళ్లాడబోతున్నట్టు ఎడతెరిపి లేకుండా వస్తున్న కథనాలపై రొమేనియన్‌ టీవీ నటి లులియా వంటుర్‌ ఎట్టకేలకు స్పందించింది.

బాలీవుడ్‌ బ్యాచిలర్‌ సల్మాన్‌ ఖాన్‌ను తాను పెళ్లాడబోతున్నట్టు ఎడతెరిపి లేకుండా వస్తున్న కథనాలపై రొమేనియన్‌ టీవీ నటి లులియా వంటుర్‌ ఎట్టకేలకు స్పందించింది. తనకు గతంలోనే పెళ్లయిందని, రొమేనియన్‌ స్టార్ హీరోను తాను పెళ్లాడనని వచ్చిన వార్తలనూ ఆమె తోసిపుచ్చింది. ఇప్పుట్లో తను పెళ్లికి తొందరపడటం లేదని స్పష్టం చేసింది.

'ప్రియమైన మిత్రులారా! వదంతులపై స్పందించాల్సిన అవసరం లేదని ఇప్పటివరకు భావించాను. కానీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నాను. నాకు గతంలో ఎప్పుడూ పెళ్లి కాలేదు. అదే సమయంలో నేను త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి ఉవ్విళ్లూరడం లేదు' అని లులియ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పేర్కొంది.

మరోవైపు పెళ్లి వార్తలపై సల్మాన్‌ ఖాన్‌ కూడా స్పందించిన విషయం తెలిసిందే. తాను పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు పెళ్లి చేసుకుంటానని, అప్పుడు ఆ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులందరికీ తెలియజేస్తానని సల్మాన్‌ స్పష్టం చేశాడు. లులియ-సల్మాన్ పెళ్లి వచ్చే డిసెంబర్‌లో జరగనుందని, ఈమేరకు సల్మాన్ కుటుంబం ఏర్పాట్లు కూడా చేసుకుంటుందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement